Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

రేపు ఎస్‌ఐ ప్రిలిమ్స్‌.. నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు!

Author MANA VISHWAM | 28 Nov 2026, 09:03 PM | తాజా వార్తలు
రేపు ఎస్‌ఐ ప్రిలిమ్స్‌.. నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు!

తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక ఘట్టం ఆసన్నమైంది. రాష్ట్రవ్యాప్తంగా 275 ఎస్‌ఐ (సివిల్‌), తత్సమాన హోదా పోస్టుల భర్తీకి ఆదివారం ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నారు. దాదాపు 335 పరీక్ష కేంద్రాల్లో 1,60,712 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. సగటున ఒక్కో పోస్టుకు 584 మంది పోటీ పడుతున్నారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి తెలంగాణ పోలీసు నియామక మండలి కఠిన నిబంధనలు అమలు చేయనుంది.

నిమిషం ఆలస్యమైనా అంతే..!

ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 10 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా ప్రవేశం ఉండదు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాల చిరునామాలను ముందుగానే తెలుసుకుని నిర్ణీత సమయానికి చేరుకోవాలి. దరఖాస్తు సమయంలో సమర్పించిన పాస్‌పోర్టు సైజు ఫొటోనే హాల్‌టికెట్‌పై నిర్దేశిత ప్రదేశంలో జిగురుతో అతికించాలి. ఫొటో అతికించని అభ్యర్థులను పరీక్షకు అనుమతించరు.

బయోమెట్రిక్‌ తనిఖీలు..

ఇవి కూడా చదవండి

అభ్యర్థుల వేలిముద్రలు, ఫొటోలు, సంతకాలతోపాటు ఆధార్‌ ఆధారిత ముఖ గుర్తింపు ద్వారా ధ్రువీకరణ చేపట్టనున్నారు. వేలికి మెహందీ, తాత్కాలిక టాటూలు పెట్టుకోవద్దని సూచించారు. హాల్‌టికెట్‌తోపాటు నీలం లేదా నలుపు రంగు బాల్‌పాయింట్‌ పెన్నుకు మాత్రమే అనుమతి ఉంది. సెల్‌ఫోన్లు, చేతి గడియారాలు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలపై నిషేధం విధించారు.

తప్పు సమాధానాలకు మార్కుల కోత

ప్రాథమిక రాత పరీక్షలో తప్పు సమాధానాలకు మార్కుల కోత ఉంటుంది. ప్రశ్నపత్రాలు ఆంగ్లం–తెలుగు, ఆంగ్లం–ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంటాయి. పరీక్ష ముగిసిన అనంతరం ఓఎంఆర్‌ సమాధాన పత్రాలను పరీక్ష పర్యవేక్షకులకు తప్పనిసరిగా అందజేయాలి.

అర్ధరాత్రి వరకే హాల్‌టికెట్లు

శనివారం అర్ధరాత్రి 12 గంటల వరకు www.tgprb.in వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. సమస్యలు ఎదురైతే 040-41895151 నంబరులో సంప్రదించాలని పోలీసు నియామక మండలి సూచించింది.