రేపు ఎస్‌ఐ ప్రిలిమ్స్‌.. నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు!

తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కీలక ఘట్టం ఆసన్నమైంది. రాష్ట్రవ్యాప్తంగా 275 ఎస్‌ఐ (సివిల్‌), తత్సమాన హోదా పోస్టుల భర్తీకి ఆదివారం ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నారు. దాదాపు 335 పరీక్ష కేంద్రాల్లో 1,60,712 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. సగటున ఒక్కో పోస్టుకు 584 మంది పోటీ పడుతున్నారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి తెలంగాణ పోలీసు నియామక మండలి కఠిన నిబంధనలు అమలు చేయనుంది. నిమిషం ఆలస్యమైనా అంతే..! ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 10 గంటల తర్వాత ఒక్క...