Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉంది

Author MANA VISHWAM | 26 Jul 2026, 10:15 AM | Array
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉంది

హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలింపు ఏర్పాట్లు

సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దు: వైద్యులు

హనుమకొండ, జూలై 26 (మన విశ్వం): గుండెపోటుకు గురైన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. హనుమకొండలోని రోహిణి ఆస్పత్రి డైరెక్టర్ డా. సుధాకర్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ఈ విషయాన్ని తెలిపారు.
ఆయన మాట్లాడుతూ, గుండెపోటు లక్షణాలతో పెద్ది సుదర్శన్ రెడ్డిని ఆస్పత్రికి తీసుకురాగానే అత్యవసర చికిత్స ప్రారంభించామని చెప్పారు. వైద్య పరీక్షల్లో ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించామని, దానికి అవసరమైన చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.
ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు డా. సుధాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అధికారికంగా వైద్యులు విడుదల చేసే హెల్త్ బులెటిన్లనే విశ్వసించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి