Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

రాజ్యాంగ దినోత్సవానికి ఇలేగాం ముస్తాబు

Author MANA VISHWAM | 24 Nov 2026, 07:51 PM | తాజా వార్తలు
రాజ్యాంగ దినోత్సవానికి ఇలేగాం ముస్తాబు

నవంబర్‌ 26న ఘనంగా ‘సంవిధాన్ గౌరవ్ సొహళా’

ముధోల్ నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత ప్రచారం

వేడుకలను విజయవంతం చేయాలని రిపబ్లికన్ యూత్ పిలుపు

ఇవి కూడా చదవండి

ముధోల్ ఆర్సీ (భైంసా రూరల్), నవంబర్‌ 24 (మన విశ్వం): భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా భైంసా మండలం ఇలేగాం గ్రామంలో ఈ నెల 26న ‘సంవిధాన్ గౌరవ్ సొహళా’ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రిపబ్లికన్ యూత్ ఆధ్వర్యంలో ముధోల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో గోడపత్రికలను ఆవిష్కరిస్తూ విస్తృత ప్రచారం చేపట్టారు. రాజ్యాంగం ప్రతిపాదించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం వంటి విలువలను ప్రజలకు చాటిచెప్పడమే ఈ వేడుకల లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

గురువారం ఉదయం 10.30 గంటలకు కెప్టెన్ నారాయణ్ వాఘ్మారే ముధోల్కర్ జెండా ఆవిష్కరణతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. సాహెబ్‌రావ్ శహాణే పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. భీమ్ టైగర్ సేన జాతీయ అధ్యక్షుడు దాదాసాహెబ్ షేళ్కే, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పవార్, మాజీ ఎమ్మెల్యేలు జి.విఠల్‌రెడ్డి, నారాయణ్ పటేల్ భోస్లే హాజరుకానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాత్రి 9.30 గంటలకు మహారాష్ట్ర గాయకులు అంజలి ఘోడ్కే, అరుణ్ కదమ్ బృందంతో భీమ్ గీతాల విభావరి నిర్వహించనున్నారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు అధిక సంఖ్యలో తరలివచ్చి వేడుకలను విజయవంతం చేయాలని కార్యక్రమ అధ్యక్షుడు కాంబ్లే వెంకటేష్ నారాయణ్, ఉపాధ్యక్షుడు కాంబ్లే గౌతం చాంద్‌రామ్, లకొండే దత్తు, రిపబ్లికన్ యూత్ సభ్యులు కోరారు.