రాజ్యాంగ దినోత్సవానికి ఇలేగాం ముస్తాబు

నవంబర్‌ 26న ఘనంగా ‘సంవిధాన్ గౌరవ్ సొహళా’ ముధోల్ నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత ప్రచారం వేడుకలను విజయవంతం చేయాలని రిపబ్లికన్ యూత్ పిలుపు ముధోల్ ఆర్సీ (భైంసా రూరల్), నవంబర్‌ 24 (మన విశ్వం): భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా భైంసా మండలం ఇలేగాం గ్రామంలో ఈ నెల 26న ‘సంవిధాన్ గౌరవ్ సొహళా’ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రిపబ్లికన్ యూత్ ఆధ్వర్యంలో ముధోల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో గోడపత్రికలను ఆవిష్కరిస్తూ విస్తృత ప్రచారం చేపట్టారు. రాజ్యాంగం ప్రతిపాదించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం వంటి విలువలను ప్రజలకు చాటిచెప్పడమే ఈ వేడుకల లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. గురువారం ఉదయం 10.30...