Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

ఉద్యోగులకు.. డబుల్ డీఏ!

Author MANA VISHWAM | 23 Sep 2026, 09:46 PM | TELANGANA
ఉద్యోగులకు.. డబుల్ డీఏ!

హైదరాబాద్‌, సెప్టెంబర్ 23 (మన విశ్వం): తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రెండు పెండింగ్ డీఏలు అందే దిశగా కీలక ముందడుగు పడింది. 3.64 శాతం, 2.74 శాతం చొప్పున రెండు డీఏలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో జరిగిన సమావేశం అనంతరం వారు ఈ వివరాలు వెల్లడించారు.


మూడు అడిగితే.. రెండింటికి ఓకే

పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కోరగా, ప్రస్తుతం రెండు డీఏలకు ప్రభుత్వం సానుకూలత తెలిపినట్లు నేతలు పేర్కొన్నారు. మరో డీఏను మూడు, నాలుగు నెలల్లో ఇచ్చేందుకు హామీ లభించినట్లు తెలిపారు. పీఆర్సీ, పెండింగ్ బిల్లులు సహా ఉద్యోగుల ఇతర సమస్యలపైనా సమావేశంలో చర్చించినట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి


కేబినెట్ ఆమోదమే కీలకం

రెండు డీఏలపై ప్రభుత్వం సానుకూలత తెలిపినప్పటికీ అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడాల్సి ఉంది. కేబినెట్ ఆమోదం అనంతరం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేస్తే అమలు తేదీ, బకాయిల చెల్లింపు విధానంపై పూర్తి స్పష్టత రానుంది. దీంతో ఇప్పుడు ఉద్యోగుల దృష్టి ప్రభుత్వ తుది నిర్ణయంపై పడింది.