ఉద్యోగులకు.. డబుల్ డీఏ!

హైదరాబాద్‌, సెప్టెంబర్ 23 (మన విశ్వం): తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రెండు పెండింగ్ డీఏలు అందే దిశగా కీలక ముందడుగు పడింది. 3.64 శాతం, 2.74 శాతం చొప్పున రెండు డీఏలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో జరిగిన సమావేశం అనంతరం వారు ఈ వివరాలు వెల్లడించారు. మూడు అడిగితే.. రెండింటికి ఓకే పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కోరగా, ప్రస్తుతం రెండు డీఏలకు ప్రభుత్వం సానుకూలత తెలిపినట్లు నేతలు పేర్కొన్నారు. మరో డీఏను మూడు, నాలుగు నెలల్లో ఇచ్చేందుకు హామీ లభించినట్లు తెలిపారు. పీఆర్సీ, పెండింగ్...