Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

రాముడికిచ్చిన రూ.100 కోట్ల మాటేమైంది?

Author MANA VISHWAM | 23 Sep 2026, 09:39 PM | తాజా వార్తలు
రాముడికిచ్చిన రూ.100 కోట్ల మాటేమైంది?

భద్రాచలం, సెప్టెంబర్ 23 (మన విశ్వం): భద్రాద్రి రాముడి అభివృద్ధిపై బీఆర్‌ఎస్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టార్గెట్ చేశారు. 2016లో అప్పటి సీఎం కేసీఆర్ భద్రాచలం ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించారని, పదేళ్లు అధికారంలో ఉన్నా ఆ హామీ పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. “ఓట్ల కోసం చివరకు దేవుడి పేరు చెప్పి కూడా ప్రజలను మోసం చేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది” అని ఆరోపించారు.


రూ.100 కోట్ల హామీ ఏమైంది?

భద్రాచలాన్ని అభివృద్ధి చేస్తామని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ రూ.100 కోట్ల హామీ పూర్తిస్థాయిలో అమలు కాలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇదే అంశాన్ని ప్రస్తావించిన పొంగులేటి.. పదేళ్ల పాలనలో భద్రాద్రికి ఇచ్చిన హామీలకు, జరిగిన పనులకు బీఆర్‌ఎస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి


ఇప్పుడు రూ.351 కోట్లతో..

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాచలం ఆలయ పునరాభివృద్ధికి రూ.351 కోట్లు కేటాయించిందని పొంగులేటి తెలిపారు. ఆలయ విస్తరణ, మౌలిక వసతులకు రూ.180 కోట్లు, పరిసరాల అభివృద్ధికి రూ.96 కోట్లు, గోదావరి ఘాట్ల అభివృద్ధికి రూ.75 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. ఈ ఏడాది మార్చిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పనులకు భూమిపూజ చేశారు.


పుష్కరాలే డెడ్‌లైన్

బుధవారం భద్రాచలం ఆలయాన్ని సందర్శించిన పొంగులేటి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం సుమారు రూ.275 కోట్ల విలువైన పనులు సాగుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం జరగకుండా చూడాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు.
2027 గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు పూర్తిస్థాయి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేలా పనులన్నీ పూర్తి చేస్తామని పొంగులేటి స్పష్టం చేశారు.