రాముడికిచ్చిన రూ.100 కోట్ల మాటేమైంది?
భద్రాచలం, సెప్టెంబర్ 23 (మన విశ్వం): భద్రాద్రి రాముడి అభివృద్ధిపై బీఆర్‌ఎస్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టార్గెట్ చేశారు. 2016లో అప్పటి సీఎం కేసీఆర్ భద్రాచలం ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించారని, పదేళ్లు అధికారంలో ఉన్నా ఆ హామీ పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. “ఓట్ల కోసం చివరకు దేవుడి పేరు చెప్పి కూడా ప్రజలను మోసం చేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది” అని ఆరోపించారు. రూ.100 కోట్ల హామీ ఏమైంది? భద్రాచలాన్ని అభివృద్ధి చేస్తామని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ రూ.100 కోట్ల హామీ పూర్తిస్థాయిలో అమలు కాలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇదే అంశాన్ని ప్రస్తావించిన పొంగులేటి.. పదేళ్ల పాలనలో భద్రాద్రికి ఇచ్చిన హామీలకు,...