Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

రూ.2 వేల కోట్లు ఒక్కచోటే.. అసలు భూ బాగోతం నేడు సభలో!

Author MANA VISHWAM | 12 Sep 2026, 11:06 AM | తాజా వార్తలు
రూ.2 వేల కోట్లు ఒక్కచోటే.. అసలు భూ బాగోతం నేడు సభలో!

22ఏ భూముల వివాదం వేళ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంచలన ట్వీట్‌ చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధరణి పేరుతో రూ.2 వేల కోట్ల విలువైన ఆర్మీ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ భూమిని కాంగ్రెస్‌ ప్రభుత్వం 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి రక్షించిందని పేర్కొన్నారు.
‘‘ఆర్మీ భూమిని కూడా వదలని బీఆర్‌ఎస్‌ భూ బకాసురులు’’ అంటూ పొంగులేటి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 22ఏ జాబితాపై బీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు ఆందోళన చెందుతున్నారో ఇప్పుడు అర్థమవుతోందా? అని ప్రశ్నించారు.
ఒక్కచోటే రూ.2 వేల కోట్ల విలువైన భూమికి సంబంధించిన దోపిడీ జరిగిందని ఆరోపిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా భూ వ్యవహారాలు ఏ స్థాయిలో జరిగి ఉంటాయో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగినట్లు ప్రభుత్వం ఆరోపిస్తున్న భూ వ్యవహారాలకు సంబంధించిన మరిన్ని సంచలన వివరాలను నేటి అసెంబ్లీ సమావేశంలో వెల్లడించనున్నట్లు పొంగులేటి సంకేతాలిచ్చారు.
22ఏపై అధికార–ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పొంగులేటి చేసిన ఈ ట్వీట్‌తో నేటి అసెంబ్లీ సమావేశంపై ఉత్కంఠ మరింత పెరిగింది.