రూ.2 వేల కోట్లు ఒక్కచోటే.. అసలు భూ బాగోతం నేడు సభలో!

22ఏ భూముల వివాదం వేళ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంచలన ట్వీట్‌ చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధరణి పేరుతో రూ.2 వేల కోట్ల విలువైన ఆర్మీ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ భూమిని కాంగ్రెస్‌ ప్రభుత్వం 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి రక్షించిందని పేర్కొన్నారు. ‘‘ఆర్మీ భూమిని కూడా వదలని బీఆర్‌ఎస్‌ భూ బకాసురులు’’ అంటూ పొంగులేటి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 22ఏ జాబితాపై బీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు ఆందోళన చెందుతున్నారో ఇప్పుడు అర్థమవుతోందా? అని ప్రశ్నించారు. ఒక్కచోటే రూ.2 వేల కోట్ల విలువైన భూమికి సంబంధించిన దోపిడీ జరిగిందని ఆరోపిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా భూ వ్యవహారాలు ఏ...