Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

క్రైస్తవుల ఐక్యతతోనే హక్కుల సాధన

Author MANA VISHWAM | 10 Sep 2026, 08:48 PM | వరంగల్
క్రైస్తవుల ఐక్యతతోనే హక్కుల సాధన

వరంగల్‌, సెప్టెంబర్‌ 10 (మన విశ్వం): క్రైస్తవులు, దైవ సేవకులు ఐక్యంగా ఉంటూ సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించాలని ఎన్‌సీఆర్‌ఎఫ్‌ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం కెమిస్ట్రీ భవన్‌లో ఎన్‌సీఆర్‌ఎఫ్‌ సేవకుల సదస్సు ఘనంగా నిర్వహించారు. ఎన్‌సీఆర్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు రెవ. ఇసంపెల్లి అబ్రహం ఆధ్వర్యంలో, రాష్ట్ర అధ్యక్షుడు కనుకం కరుణాకర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంస్థ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రతి నెల కమిటీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సభ్యులకు రూ.15 లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సదుపాయం కల్పించడంతో పాటు, సభ్యులు మృతి చెందితే వారి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందిస్తామని జాతీయ అధ్యక్షుడు ఇసంపెల్లి అబ్రహం తెలిపారు. ప్రతి నెల కమిటీ సమావేశం ఏర్పాటు చేసిన వారికి రూ.2 వేల చొప్పున అందిస్తామని పేర్కొన్నారు.
ఎన్‌సీఆర్‌ఎఫ్‌ జాతీయ సలహాదారు రెవ. డాక్టర్‌ మంద కుమార్‌ మాట్లాడుతూ పాస్టర్లు ఐక్యతతో ఉంటూ సమాజం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. తెలంగాణ జనరల్‌ సెక్రటరీ రెవ. ఎలైజ ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభించగా, రాష్ట్ర వైస్‌ ప్రెసిడెంట్‌ రెవ. జన్ను ప్రభాకర్‌ శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్య అతిథి క్రిస్టియన్‌ నాయకుడు బ్రదర్‌ ఎస్‌. దీన్‌ దయాల్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రేమతో ఉంటూ ఇతరులకు యేసు ప్రేమను పంచాలని కోరారు. ఎన్‌సీఆర్‌ఎఫ్‌ సేవకులకు అన్ని వేళలా అండగా ఉంటుందని తెలిపారు. క్రిస్టియన్‌ సేవా సంఘ్‌ జాతీయ అధ్యక్షుడు మల్లెల రాజు మాట్లాడుతూ క్రైస్తవులంతా ఐక్యంగా ఉంటూ తమ హక్కులను సంరక్షించుకోవాలని, ఒకరికొకరు అండగా నిలిచి తమకు లభించాల్సిన హక్కులను ఐక్యతతో సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్య ప్రసంగికుడు రెవ. పి. పాల్‌ కిషోర్‌ వాక్య సందేశాన్ని అందించారు.
సదస్సులో ములుగు జిల్లా అధ్యక్షుడు దానియేలు, చిట్యాల మండల అధ్యక్షుడు దానియేలు, ఎన్‌సీఆర్‌ఎఫ్‌ సలహాదారు బ్రదర్‌ ఇనుగుల బాబురావు, రెవ. దాసరి నవీన్‌కుమార్‌, బ్రదర్‌ లాజర్‌, నర్సంపేట డివిజన్‌ అధ్యక్షుడు సమీయేల్‌ బృందం, పాస్టర్‌ చక్రపాణి, ఎన్‌సీఆర్‌ఎఫ్‌ అధికార ప్రతినిధి రెవ. డాక్టర్‌ జూపాక యాకోబు, విక్టర్‌, యహోషువ తదితరులు పాల్గొన్నారు.