క్రైస్తవుల ఐక్యతతోనే హక్కుల సాధన

వరంగల్‌, సెప్టెంబర్‌ 10 (మన విశ్వం): క్రైస్తవులు, దైవ సేవకులు ఐక్యంగా ఉంటూ సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించాలని ఎన్‌సీఆర్‌ఎఫ్‌ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం కెమిస్ట్రీ భవన్‌లో ఎన్‌సీఆర్‌ఎఫ్‌ సేవకుల సదస్సు ఘనంగా నిర్వహించారు. ఎన్‌సీఆర్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు రెవ. ఇసంపెల్లి అబ్రహం ఆధ్వర్యంలో, రాష్ట్ర అధ్యక్షుడు కనుకం కరుణాకర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంస్థ భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి నెల కమిటీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సభ్యులకు రూ.15 లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సదుపాయం కల్పించడంతో పాటు, సభ్యులు మృతి చెందితే వారి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందిస్తామని జాతీయ అధ్యక్షుడు ఇసంపెల్లి అబ్రహం తెలిపారు....