Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

ఖాకీ కొలువులకు మరో వారం!

Author MANA VISHWAM | 08 Sep 2026, 02:49 PM | తాజా వార్తలు
ఖాకీ కొలువులకు మరో వారం!

పోలీస్‌ కొలువు లక్ష్యంగా సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఊరట. తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌–2026 దరఖాస్తుల గడువును మరో వారం పొడిగించారు. సెప్టెంబర్‌ 9తో ముగియాల్సిన గడువును సెప్టెంబర్‌ 16 వరకు పొడిగించడంతో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి మరో అవకాశం లభించింది.
రాష్ట్రంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌, ఏఎస్ఐ, ఫైర్‌ ఫైటర్‌, వార్డర్‌ తదితర విభాగాల్లో మొత్తం 7,437 పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నియామక ప్రక్రియ చేపట్టింది. ఇందులో 7,112 కానిస్టేబుల్‌ స్థాయి పోస్టులు, 275 ఎస్‌ఐ స్థాయి పోస్టులు, 27 మెకానిక్‌/డ్రైవర్‌, 23 ఏఎస్ఐ ఫింగర్‌ప్రింట్‌ బ్యూరో పోస్టులు ఉన్నాయి.
గడువు ముగిసేందుకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థుల నుంచి గడువు పెంచాలన్న విజ్ఞప్తులు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరో వారం అవకాశం కల్పించడం వేలాది మంది అభ్యర్థులకు ప్రయోజనం చేకూర్చనుంది. చివరి రోజు వరకు వేచి చూడకుండా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.