ఖాకీ కొలువులకు మరో వారం!
పోలీస్ కొలువు లక్ష్యంగా సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఊరట. తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్–2026 దరఖాస్తుల గడువును మరో వారం పొడిగించారు. సెప్టెంబర్ 9తో ముగియాల్సిన గడువును సెప్టెంబర్ 16 వరకు పొడిగించడంతో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఎస్‌ఐ, కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఫైర్ ఫైటర్, వార్డర్ తదితర విభాగాల్లో మొత్తం 7,437 పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నియామక ప్రక్రియ చేపట్టింది. ఇందులో 7,112 కానిస్టేబుల్ స్థాయి పోస్టులు, 275 ఎస్‌ఐ స్థాయి పోస్టులు, 27 మెకానిక్/డ్రైవర్, 23 ఏఎస్ఐ ఫింగర్‌ప్రింట్ బ్యూరో పోస్టులు ఉన్నాయి. గడువు ముగిసేందుకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థుల నుంచి...