Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

నెక్కొండ రెసిడెన్షియల్‌లో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

Author MANA VISHWAM | 06 Sep 2026, 01:49 PM | వరంగల్
నెక్కొండ రెసిడెన్షియల్‌లో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

నర్సంపేట , సెప్టెంబర్‌ 6 (మన విశ్వం): నెక్కొండ మండల కేంద్రంలోని తెలంగాణ రెసిడెన్షియల్‌ స్కూల్‌, జూనియర్‌ కళాశాలను వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న విద్య, భోజనం, వసతి సౌకర్యాలను పరిశీలించారు.
తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్‌ బోధన, అభ్యసన సామర్థ్యం, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం వసతి గదులు, భోజనశాల, వంటశాలను పరిశీలించారు. విద్యార్థులకు పరిశుభ్రమైన, పౌష్టికాహారం అందించాలని, వంటశాల, భోజనశాల పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అవసరమైన మౌలిక వసతుల్లో ఎలాంటి లోటు లేకుండా చూడాలని సూచించారు. నాణ్యమైన విద్యతోపాటు క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకునేలా మార్గనిర్దేశం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.
కలెక్టర్‌ వెంట నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, డీటీడీవో నారాయణరెడ్డి, నెక్కొండ తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, డీఎస్‌డీవో హమీద్‌, ఎంపీడీవో, ఎంపీవోలు తదితరులు ఉన్నారు.

నెక్కొండ రెసిడెన్షియల్‌లో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ - Additional Image