నెక్కొండ రెసిడెన్షియల్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
నర్సంపేట , సెప్టెంబర్ 6 (మన విశ్వం): నెక్కొండ మండల కేంద్రంలోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాలను వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న విద్య, భోజనం, వసతి సౌకర్యాలను పరిశీలించారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ బోధన, అభ్యసన సామర్థ్యం, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం వసతి గదులు, భోజనశాల, వంటశాలను పరిశీలించారు. విద్యార్థులకు పరిశుభ్రమైన, పౌష్టికాహారం అందించాలని, వంటశాల, భోజనశాల పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అవసరమైన మౌలిక వసతుల్లో ఎలాంటి లోటు లేకుండా చూడాలని...