Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

హైడ్రాపై హైకోర్టు కీలక ఆదేశాలు

Author MANA VISHWAM | 31 Jul 2026, 10:04 PM | హైదరాబాద్
హైడ్రాపై హైకోర్టు కీలక ఆదేశాలు

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు సంబంధించిన కోర్టు ధిక్కరణ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన నేపథ్యంలో రంగనాథ్ స్థానంలో మరో అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
లోతుకుంట భూముల వివాదం కేసు విచారణ సందర్భంగా గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా వివాదాస్పద స్థలంలో యంత్రాలు, సిబ్బందితో ప్రవేశించడం న్యాయస్థానం ఆదేశాల ఉల్లంఘనేనని హైకోర్టు పేర్కొంది. అధికారులు న్యాయస్థానాల ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని, చట్టబద్ధ పాలనకు ఎలాంటి భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.