Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

రేషన్ కార్డుదారులకు భారీ ఊరట..!

Author MANA VISHWAM | 31 Jul 2026, 10:01 PM | హైదరాబాద్
రేషన్ కార్డుదారులకు భారీ ఊరట..!

తెలంగాణలో రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరటనిచ్చింది. ఈ-కేవైసీ పూర్తి చేసుకునేందుకు ఇచ్చిన గడువును ఆగస్టు 31వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. శుక్రవారంతో గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, రాష్ట్రంలోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు ఈ-కేవైసీ పూర్తి చేయలేకపోయిన లక్షలాది మంది లబ్ధిదారులకు మరో నెల రోజుల అవకాశం లభించింది.
ప్రారంభంలో ఈ గడువు పొడిగింపును హైదరాబాద్ మహానగర పరిధికే పరిమితం చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ, జిల్లాల నుంచి కూడా పెద్దఎత్తున విజ్ఞప్తులు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం కొనసాగుతున్న'స్మార్ట్'ప్రక్రియ పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు రేషన్ దుకాణాలకు వెళ్లలేని పరిస్థితులను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకున్నట్లు అధికారులు తెలిపారు.


ఆందోళనకు చెక్

ఈ-కేవైసీ పూర్తి చేయని వారి రేషన్ కార్డులు రద్దు అవుతాయన్న ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. అయితే గడువును పొడిగించడం ద్వారా ఆ అనుమానాలకు ప్రభుత్వం తెరదించింది.ఆగస్టు 31లోపు సమీప చౌకధరల దుకాణానికి వెళ్లి వేలిముద్రల ధ్రువీకరణతో ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. కుటుంబంలోని ప్రతి సభ్యుడి వివరాలను ధ్రువీకరించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి


మూడు నెలల రేషన్ ఒకేసారి

రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం మరో శుభవార్త కూడా ప్రకటించింది. ఈ -కే వైసి పూర్తయిందా లేదా అన్నదానితో సంబంధం లేకుండా శనివారం నుంచి 3నెలల బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో ఈ-కేవైసీ పూర్తికాలేదన్న కారణంతో రేషన్ నిలిపివేస్తారన్న ప్రచారానికి పూర్తిగా చెక్ పడింది.


వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యలు

భారీ వర్షాలు, వాతావరణ పరిస్థితులు, సరఫరా వ్యవస్థ నిర్వహణ, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని మూడు నెలల రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. రేషన్ దుకాణాల్లో తగిన నిల్వలు ఉంచి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఈ-కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులు గడువు ముగిసేలోపు తప్పనిసరిగా ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ-కేవైసీ ప్రక్రియను వేగవంతం చేస్తూనే, ప్రతి అర్హ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రేషన్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అధికారులు తెలిపారు. తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని లక్షలాది రేషన్ కార్డుదారులకు గణనీయమైన ఊరట లభించింది.