రేషన్ కార్డుదారులకు భారీ ఊరట..!
తెలంగాణలో రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరటనిచ్చింది. ఈ-కేవైసీ పూర్తి చేసుకునేందుకు ఇచ్చిన గడువును ఆగస్టు 31వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. శుక్రవారంతో గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, రాష్ట్రంలోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు ఈ-కేవైసీ పూర్తి చేయలేకపోయిన లక్షలాది మంది లబ్ధిదారులకు మరో నెల రోజుల అవకాశం లభించింది. ప్రారంభంలో ఈ గడువు పొడిగింపును హైదరాబాద్ మహానగర పరిధికే పరిమితం చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ, జిల్లాల నుంచి కూడా పెద్దఎత్తున విజ్ఞప్తులు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం కొనసాగుతున్న'స్మార్ట్'ప్రక్రియ పలు జిల్లాల్లో కురుస్తున్న...