Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

పెద్ది సుదర్శన్‌రెడ్డిని పరామర్శించిన కవిత

Author MANA VISHWAM | 29 Jul 2026, 03:07 PM | హైదరాబాద్
పెద్ది సుదర్శన్‌రెడ్డిని పరామర్శించిన కవిత

సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న కవిత, ప్రస్తుతం అందిస్తున్న చికిత్స, ఆరోగ్య పురోగతిపై వివరాలు సేకరించారు.
అనంతరం ఆస్పత్రిలో ఉన్న పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఆయన సతీమణితో పాటు కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, పెద్ది సుదర్శన్‌రెడ్డి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు తిరిగి రావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో తనతో కలిసి పనిచేసిన పెద్ది సుదర్శన్‌రెడ్డి త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన త్వరితగతిన ఆరోగ్యవంతుడై ప్రజల ఆశీస్సులతో తిరిగి సేవలందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్యంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఆయనను పరామర్శించి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించినట్లు తెలిపారు. ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది.

పెద్ది సుదర్శన్‌రెడ్డిని పరామర్శించిన కవిత - Additional Image