పెద్ది సుదర్శన్‌రెడ్డిని పరామర్శించిన కవిత
సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న కవిత, ప్రస్తుతం అందిస్తున్న చికిత్స, ఆరోగ్య పురోగతిపై వివరాలు సేకరించారు. అనంతరం ఆస్పత్రిలో ఉన్న పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఆయన సతీమణితో పాటు కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, పెద్ది సుదర్శన్‌రెడ్డి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో తనతో కలిసి పనిచేసిన పెద్ది సుదర్శన్‌రెడ్డి త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో చురుకుగా...