Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

Author MANA VISHWAM | 25 Jul 2026, 03:43 PM | NATIONAL
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

నీట్ అక్రమాల ఉద్యమం ఫలితం ప్రధాని మోదీకి

రాజీనామా లేఖ సమర్పణ విద్యార్థుల ఆకాంక్షలకు గౌరవం తెలిపినట్లు ప్రకటన

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా - Additional Image

న్యూఢిల్లీ, జులై 25 (మన విశ్వం): దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల అక్రమాలు, ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై నెలలుగా కొనసాగుతున్న విద్యార్థుల ఉద్యమం కీలక మలుపు తిరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించిన అనంతరం ఆయన విడుదల చేసిన ప్రకటనలో, దేశ యువత భావోద్వేగాలు, ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా నెలకొన్న పరిణామాలు తనను తీవ్రంగా కలిచివేశాయని పేర్కొన్న ప్రధాన్, ఈ నిర్ణయం వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం కాదని, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తీసుకున్న బాధ్యతాయుతమైన చర్య అని స్పష్టం చేశారు. జంతర్‌మంతర్‌తో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో విద్యార్థులు చేపట్టిన నిరసనలను తాను అత్యంత గంభీరంగా పరిగణించినట్లు తెలిపారు.
తాను నాలుగు దశాబ్దాలుగా విద్యారంగంలో సేవలందిస్తున్నానని గుర్తుచేసిన ఆయన, నీట్ పరీక్షల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందని వివరించారు. అనంతరం పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించామని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పరీక్షలు నిర్వహించాయని పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల నుంచి కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
పరీక్షా వ్యవస్థలో అక్రమాలకు తావులేకుండా చేయడమే తన లక్ష్యమని, ఒక్క ప్రతిభావంతుడికీ అన్యాయం జరగకుండా చూడాలనే ఉద్దేశంతోనే మొదటి రోజు నుంచే బాధ్యతలు నిర్వర్తించానని ప్రధాన్ తెలిపారు. అయితే రీ-ఎగ్జామ్ ఫలితాల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు, విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనలు తనను తీవ్రంగా బాధించాయని పేర్కొన్నారు. దేశంలో విద్యా వ్యవస్థపై ప్రజల విశ్వాసం నిలబెట్టేందుకు, విద్యార్థులు తిరిగి చదువుపై దృష్టి సారించేలా చేయడానికే తన పదవికి వైదొలుగుతున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా తనపై విశ్వాసం ఉంచిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజాసేవ కొనసాగిస్తానని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

విద్యార్థుల ఉద్యమంతో పెరిగిన ఒత్తిడి

నీట్ పరీక్షల అక్రమాలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జూన్ నెల నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష, అనంతరం నిర్వహించిన ‘చలో సంసద్’ కార్యక్రమాలతో ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చింది. నిరసనల సందర్భంగా జరిగిన లాఠీచార్జీలు, వాంగ్‌చుక్‌ను బలవంతంగా ఆసుపత్రికి తరలించిన ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం విద్యార్థి ప్రతినిధులతో రెండు దఫాల చర్చలు నిర్వహించింది. బాధిత విద్యార్థులకు పరిహారం, నిరసనల్లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు ఉండవని హామీ ఇవ్వడంతో పాటు పరీక్షా వ్యవస్థలో సంస్కరణలకు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్‌పై విద్యార్థులు వెనక్కి తగ్గకపోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరిగింది. చివరకు ఉద్యమ తీవ్రత, విద్యార్థుల పట్టుదల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.