Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

క్యాంపస్‌లలో డ్రగ్స్‌కు చెక్.. యాజమాన్యాలకూ బాధ్యత

Author MANA VISHWAM | 24 Jul 2026, 10:24 PM | హైదరాబాద్
క్యాంపస్‌లలో డ్రగ్స్‌కు చెక్.. యాజమాన్యాలకూ బాధ్యత

అవసరమైతే ప్రత్యేక చట్టం: సీఎం రేవంత్ రెడ్డి

విద్యా సంస్థల్లో డ్రగ్స్ ఘటనలకు యాజమాన్యాలూ జవాబుదారీ

క్యాంపస్‌లలో డ్రగ్స్‌కు చెక్.. యాజమాన్యాలకూ బాధ్యత - Additional Image

టోల్‌ఫ్రీ నంబర్, క్యూఆర్ కోడ్ ఏర్పాటు పరిశీలన

ఇవి కూడా చదవండి

డీ-అడిక్షన్, కౌన్సిలింగ్‌తో పాటు పునరావృతానికి కఠిన చర్యలు


రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల క్యాంపస్‌లలో డ్రగ్స్‌కు సంబంధించిన ఏ ఘటన జరిగినా ఆయా సంస్థల యాజమాన్యాలు కూడా బాధ్యత వహించేలా నిబంధనలు రూపొందించాలని సూచించారు. అవసరమైతే డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావడంపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిరోధం, భద్రత కమిటీల పనితీరుపై ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో శుక్రవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్ నియంత్రణను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణిస్తోందని, విద్యా సంస్థలకు అధికారాలతో పాటు స్పష్టమైన బాధ్యతలు కూడా అప్పగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
విద్యా సంస్థల క్యాంపస్‌లలోనే కాకుండా, క్యాంపస్ వెలుపల విద్యార్థులతో సంబంధం ఉన్న అనుమానాస్పద కార్యకలాపాలను కూడా గుర్తించి పోలీసులకు సమాచారం అందించే వ్యవస్థను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకునేలా ప్రతి విద్యా సంస్థలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని చెప్పారు.
డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా అందించేందుకు ప్రతి విద్యా సంస్థలో టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటు ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ సమస్యను ఎదుర్కోవడంలో గుర్తింపు – మాన్పించడం – శిక్షించడం అనే మూడు దశల వ్యూహాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
డ్రగ్స్ వినియోగిస్తూ పట్టుబడిన వారికి మొదట డీ-అడిక్షన్ కేంద్రాల్లో చికిత్స, కౌన్సిలింగ్ అందించాలని, అయినప్పటికీ మళ్లీ అదే తప్పు చేస్తే కఠిన శిక్షలు విధించే విధానాన్ని రూపొందించాలని సీఎం సూచించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు పి. సుదర్శన్ రెడ్డి, కె. రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ఈగల్ విభాగం డైరెక్టర్ సందీప్ శాండిల్యతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.