క్యాంపస్‌లలో డ్రగ్స్‌కు చెక్.. యాజమాన్యాలకూ బాధ్యత

అవసరమైతే ప్రత్యేక చట్టం: సీఎం రేవంత్ రెడ్డి విద్యా సంస్థల్లో డ్రగ్స్ ఘటనలకు యాజమాన్యాలూ జవాబుదారీ టోల్‌ఫ్రీ నంబర్, క్యూఆర్ కోడ్ ఏర్పాటు పరిశీలన డీ-అడిక్షన్, కౌన్సిలింగ్‌తో పాటు పునరావృతానికి కఠిన చర్యలు రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల క్యాంపస్‌లలో డ్రగ్స్‌కు సంబంధించిన ఏ ఘటన జరిగినా ఆయా సంస్థల యాజమాన్యాలు కూడా బాధ్యత వహించేలా నిబంధనలు రూపొందించాలని సూచించారు. అవసరమైతే డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావడంపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిరోధం, భద్రత కమిటీల పనితీరుపై...