Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

రెడ్‌కో డీఈపై ఏసీబీ ఉచ్చు

Author MANA VISHWAM | 22 Jul 2026, 09:53 AM | Array
రెడ్‌కో డీఈపై ఏసీబీ ఉచ్చు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు

రూ.27.65 కోట్ల ఆస్తుల గుర్తింపు.. 8 చోట్ల సోదాలు

రూ.20 కోట్ల అపార్ట్‌మెంట్లు.. 2.094 కిలోల బంగారం.. గతంలోనూ లంచం కేసు

మించి భారీగా ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (రెడ్‌కో) డివిజనల్ ఇంజనీర్ ముత్యం వెంకట రమణపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. బుధవారం ఆయన నివాసం, కార్యాలయంతో పాటు బంధువులు, బినామీలకు చెందిన మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. సోదాల్లో అధికారిక లెక్కల ప్రకారం రూ.27.65 కోట్ల విలువైన ఆస్తులు వెలుగుచూశాయి. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్ లో మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏసీబీ పేర్కొంది.
సోదాల్లో శేరిలింగంపల్లి , కూకట్‌పల్లి ప్రాంతాల్లో నాలుగు ఫ్లాట్లు, అంజనేయనగర్‌లో జీ+3 వాణిజ్య భవనం, గుత్తల బేగంపేట్‌లో జీ+5 వాణిజ్య భవనం ఉన్నట్లు గుర్తించారు. వీటి అధికారిక విలువ సుమారు రూ.5.95 కోట్లుగా నిర్ధారించారు. అంతేకాకుండా మూసాపేట్ అంజనేయనగర్‌లో సుమారు రూ.20 కోట్ల పెట్టుబడితో 10 అపార్ట్‌మెంట్లు నిర్మించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ నిర్మాణాల కోసం ఆయన భార్య పేరిట నమోదైన నాలుగు నిర్మాణ సంస్థల ద్వారా పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

బంగారం.. కార్లు.. బ్యాంకు నిల్వలు

సోదాల్లో 2,094 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.52.02 లక్షల బ్యాంకు నిల్వలు, కియా, మహీంద్రా, బలెనో కార్లు, రూ.30 లక్షల విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, 20 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. మద్యం నిల్వలపై మాదాపూర్ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కేసు నమోదు చేసింది. ఇంకా ఇతర ఆస్తులపై విచారణ కొనసాగుతోందని ఏసీబీ తెలిపింది.

ఇదే అధికారిపై గతంలోనూ కేసు

ముత్యం వెంకట రమణ 2019లో సైబర్‌సిటీ సర్కిల్‌లో డివిజనల్ ఇంజనీర్ (టెక్నికల్)గా పనిచేస్తున్న సమయంలో రూ.25 వేల లంచం స్వీకరిస్తూ ఏసీబీకి చిక్కారు. ఆ సందర్భంగా నిర్వహించిన సోదాల్లో రూ.26.52 లక్షల నగదు, రూ.22.60 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసులో చార్జిషీట్ ఇప్పటికే దాఖలై, ప్రస్తుతం కోర్టులో విచారణ కొనసాగుతోంది.
ప్రస్తుత అక్రమాస్తుల కేసులో నిందితుడిని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచి రిమాండ్ కోరనున్నట్లు అధికారులు తెలిపారు.