రెడ్‌కో డీఈపై ఏసీబీ ఉచ్చు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు రూ.27.65 కోట్ల ఆస్తుల గుర్తింపు.. 8 చోట్ల సోదాలు రూ.20 కోట్ల అపార్ట్‌మెంట్లు.. 2.094 కిలోల బంగారం.. గతంలోనూ లంచం కేసు మించి భారీగా ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (రెడ్‌కో) డివిజనల్ ఇంజనీర్ ముత్యం వెంకట రమణపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. బుధవారం ఆయన నివాసం, కార్యాలయంతో పాటు బంధువులు, బినామీలకు చెందిన మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. సోదాల్లో అధికారిక లెక్కల ప్రకారం రూ.27.65 కోట్ల విలువైన ఆస్తులు వెలుగుచూశాయి. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్ లో మరింత...