Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

లారీలు పెట్టలేదు ... కోట్ల బిల్లులు క్లియర్!

Author MANA VISHWAM | 16 Jul 2026, 01:16 PM | హన్మకొండ
లారీలు పెట్టలేదు ... కోట్ల బిల్లులు క్లియర్!

'కమలాపూర్ సెక్టార్‌'లో భారీ రవాణా కుంభకోణం?

లారీలు రాకుండానే పౌరసరఫరాల సంస్థ రికార్డుల్లో పరుగు

రైతులే సొంత వాహనాల్లో ధాన్యం తరలింపు

సీసీటీవీ ఫుటేజీలతో బయటపడే నిజాలు?

విచారణ జరిగితే అసలు నిజాలు వెలుగులోకి?

పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం రవాణాలో 'కమలాపూర్ సెక్టార్‌'లో భారీ అక్రమాలు జరిగాయనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వాస్తవానికి రైతులే తమ సొంత ట్రాక్టర్లు, ట్రాలీలు, ఇతర వాహనాల్లో ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించినప్పటికీ, అధికారిక రికార్డుల్లో మాత్రం ప్రైవేట్ లారీల ద్వారా రవాణా జరిగినట్లు నమోదు చేసి కోట్ల రూపాయల బిల్లులు చెల్లించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రాథమిక సమాచారం ప్రకారం దాదాపు 60శాతానికి పైగా ధాన్యం రైతులే స్వయంగా మిల్లులకు తరలించినట్లు స్థానిక రైతులు చెబుతున్నారు. అయినప్పటికీ అదే ధాన్యాన్ని లారీల్లో తరలించినట్లు చూపిస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించారని ఆరోపిస్తున్నారు.


సీసీటీవీ ఫుటేజీల్లో బయటపడే నిజాలు?

'కమలాపూర్ సెక్టార్' పరిధిలోని రైస్‌మిల్లుల్లో ఉన్న సిసిటివి కెమెరాల ఫుటేజీ లను పరిశీలిస్తే రికార్డుల్లో చూపించిన స్థాయిలో లారీలు రాకపోకలు సాగించలేదని తెలుస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. ధాన్యం రవాణా జరగకుండానే బిల్లులు ఎలా క్లియర్ అయ్యాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఈ వ్యవహారం వెనుక పౌరసరఫరాల శాఖలోని ఒక కీలక అధికారి పాత్ర ఉందని, ఆయన బినామీగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా'వెంకటేశ్వర లారీ ట్రాన్స్పోర్ట్ పేరుతో అక్రమంగా లారీల్లో ధాన్యం తరలించకున్నా కోట్ల రూపాయల చెల్లింపులు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

సీజన్‌ల వారీగా చెల్లింపుల వివరాలు

ఇవి కూడా చదవండి

2024-25 ఖరీఫ్ సీజన్...

ఈ సీజన్ కు సంబందించి వెంకటేశ్వరా లారీ ట్రాన్స్పోర్ట్ మొత్తం ధాన్యం 35,246.680 మెట్రిక్ టన్నులు తరలించినట్లు నమోదు చేయగా అందుకుగాను మొత్తం బిల్లు రూ.1,50,71,338.54(కోటి యాబై లక్షల డెబ్భై ఒక వేల మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయలు )చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.1,41,72,404(ఒక కోటి నలభై ఒక లక్షల డెబ్భై రెండు వేల నాలుగు వందల నాలుగు రూపాయలు )చెల్లించారు.ఇంకా రూ.6,09,702 (ఆరు లక్షల తొంబై ఏడు వేల రెండు రూపాయలు )చెల్లించాల్సి ఉన్నట్టు తెలుస్తుంది.

2024-25 రబీ సీజన్...

ఈ సీజన్ కు సంబందించి వెంకటేశ్వరా లారీ ట్రాన్స్పోర్ట్ మొత్తం ధాన్యం 33,333.640 మెట్రిక్ టన్నులు తరలించినట్లు పౌరసరఫరాల సంస్థ రికార్డుల్లో నమోదు చేశారు.అందుకుగాను మొత్తం బిల్లు రూ.1,43,19,376.56(ఒక కోటి నలభై మూడు లక్షల పంతొమ్మిది వేల మూడు వందల డెబ్భై ఆరు రూపాయలు ) చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.1,34,58,760.61 (ఒక కోటి ముప్పై నాలుగు లక్షలయాబై ఎనిమిది వేల ఏడు వందల అరవై రూపాయలు)చెల్లించారు. ఇంకా రూ.5,85,947.37(ఐదు లక్షల ఎనబై ఐదు వేల తొమ్మిది వందల నలభై ఏడు రూపాయలు ) చెల్లించాల్సి ఉందని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.

2025-26 ఖరీఫ్ సీజన్...

ఈ సీజన్ లో వెంకటేశ్వరా లారీ ట్రాన్స్పోర్ట్ మొత్తం ధాన్యం 43,191 మెట్రిక్ టన్నులు తరలించినట్లు రికార్డ్ నమోదు చేయగా ఇంకా మొత్తం బిల్లు పూర్తికాలేదని ఇప్పటివరకు
రూ. 1,00,05,800(ఒక కోటి ఐదు వేల ఎనిమిది వందలు )బిల్లు చెల్లించినట్లు తెలిసింది.

2025-26 రబీ సీజన్...

ఈ సీజన్ లో వెంకటేశ్వరా లారీ ట్రాన్స్పోర్ట్ మొత్తం ధాన్యం 35,755 మెట్రిక్ టన్నులు తరలించినట్లు రికార్డులో నమోదు చేయగా ఇంకా మొత్తం బిల్లు పూర్తికాలేదని ఇప్పటివరకు రూ.63,30,800(అరవై మూడు లక్షల ముప్పై వేల ఎనిమిది వందలు )చెల్లించినట్లు పౌరసరఫరాల సంస్థ రికార్డులు చెప్తున్నాయి.
ఇంకా పెండింగ్ బిల్లుల రూపంలో రూ. 1 కోటి నుండి రూ. 2కోట్ల వరకు చెల్లింపులకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

విచారణ జరిగితే అసలు నిజాలు వెలుగులోకి?

మిల్లుల సీసీటీవీ ఫుటేజీలు, వెయ్‌బ్రిడ్జ్ రికార్డులు, జీపీఎస్ వివరాలు, ఈ-వే బిల్లులు, రైతుల వాంగ్మూలాలు, రవాణా రిజిస్టర్లను సమగ్రంగా పరిశీలిస్తే ధాన్యం నిజంగా లారీల్లో తరలించారా? లేక కాగితాల్లోనే రవాణా చూపించి ప్రభుత్వ సొమ్మును దోచుకున్నారా? అనే అంశం తేలిపోతుందని స్థానిక రైతులు అంటున్నారు.
రైతుల కష్టార్జిత ధాన్యం పేరుతో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలపై ఉన్నత స్థాయి స్వత్రంత్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.