లారీలు పెట్టలేదు ... కోట్ల బిల్లులు క్లియర్!

'కమలాపూర్ సెక్టార్‌'లో భారీ రవాణా కుంభకోణం? లారీలు రాకుండానే పౌరసరఫరాల సంస్థ రికార్డుల్లో పరుగు రైతులే సొంత వాహనాల్లో ధాన్యం తరలింపు సీసీటీవీ ఫుటేజీలతో బయటపడే నిజాలు? విచారణ జరిగితే అసలు నిజాలు వెలుగులోకి? పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం రవాణాలో 'కమలాపూర్ సెక్టార్‌'లో భారీ అక్రమాలు జరిగాయనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. వాస్తవానికి రైతులే తమ సొంత ట్రాక్టర్లు, ట్రాలీలు, ఇతర వాహనాల్లో ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించినప్పటికీ, అధికారిక రికార్డుల్లో మాత్రం ప్రైవేట్ లారీల ద్వారా రవాణా జరిగినట్లు నమోదు చేసి కోట్ల రూపాయల బిల్లులు చెల్లించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం దాదాపు 60శాతానికి...