Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

"​మా మీద కక్షతో రైతుల నోట్లో మట్టి కొట్టకు!"

Author MANA VISHWAM | 12 Jul 2026, 09:07 AM | TELANGANA
"​మా మీద కక్షతో రైతుల నోట్లో మట్టి కొట్టకు!"

మేడిగడ్డను ముట్టకుండానే కన్నెపల్లి నుంచి 200 టీఎంసీలు ఎత్తేయొచ్చు

​రిటైర్డ్ ఇంజనీర్ల నివేదిక చూసైనా ‘సోయి’ తెచ్చుకో రేవంత్ రెడ్డి: కేటీఆర్ ధ్వజం

​ "రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచితంగా తెచ్చిన కరువు" అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయాలనే రాజకీయ కుట్రతో, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్లముందే గోదావరి నీళ్లు సముద్రం పాలువుతున్నా రైతులకు ఇవ్వకుండా ఆగం చేస్తోందని ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై నిప్పులు చెరిగారు.


​94 మీటర్లకే పంపులు ఆన్ చేయొచ్చు..


​మేడిగడ్డ గేట్లు మూసివేయకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీళ్లు లిఫ్ట్ చేయవచ్చు అని రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం ప్రభుత్వానికి స్పష్టమైన లేఖ రాసిందని కేటీఆర్ గుర్తుచేశారు. కన్నెపల్లి వద్ద ప్రస్తుతం 96.79 మీటర్ల నీళ్లు ప్రవహిస్తున్నాయని, కానీ కేవలం 94 మీటర్లకే పంపులు ఆన్ చేసే సాంకేతిక వీలుందని తెలిపారు. రాబోయే మరో 100 రోజుల పాటు కన్నెపల్లి వద్ద ఇదే తరహా ప్రవాహం ఉంటుందని అంచనా వేశారు. రోజుకు 2 టీఎంసీల చొప్పున 100 రోజుల్లో 200 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేస్తే, గోదావరి బేసిన్లో ఉన్న అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, మిడ్ మానేరు వంటి అన్ని రిజర్వాయర్లు నింపి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే అవకాశం ఉన్నా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ధ్వజమెత్తారు.

ఇవి కూడా చదవండి


​రాజకీయ ద్వేషంతో కళ్లు మూసుకుపోయాయి..

​"2022 వరదల ఫోటోలు చూపిస్తూ కన్నెపల్లి మునిగిందని రేవంత్ రెడ్డి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారు. ఎల్ నినో ప్రభావం వల్ల ఎక్కడా నీళ్లు లేకపోయినా కన్నెపల్లిలో మాత్రం నీళ్లు ఉన్నాయి. కళ్లముందు లక్ష క్యూసెక్కుల నీళ్లు వరదలాగా కిందకి పోతుంటే.. ఎత్తిపోయడానికి నీళ్లు లేవు అన్నవాడిని బుర్రతక్కువ వాడు అనాలా? లేక రైతుల కోసం ఈ పని చేయమన్నోడిని అనాలా? గురువు చంద్రబాబు నాయుడు కోసం నీళ్లను వృధాగా కిందకి వదులుతున్నావా? అని రైతులు అడుగుతుంటే దానికి సమాధానం చెప్పే దమ్ము లేని దద్దమ్మ రేవంత్ రెడ్డి" అని కేటీఆర్ తీవ్ర పదజాలంతో విమర్శించారు.


​భద్రాచలానికి అసలైన ముప్పు ‘పోలవరం’ తోనే!

​సొంత రాష్ట్ర ప్రాజెక్టుల వల్ల సొంత గడ్డకే ప్రమాదం ఉందని రేవంత్ రెడ్డి మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. భద్రాచలానికి అసలైన ముప్పు పోలవరం ప్రాజెక్టు వల్లే ఉందన్న విషయాన్ని దాస్తున్నారని ఆరోపించారు. "పోలవరం ముంపు కోసమే కదా భద్రాచలంలోని కొన్ని మండలాలను బీజేపీ ఏపీలో కలిపింది. మరి దీనిపై రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడరు? మీ గురువుకు కోపం వస్తుందనా? రాముడి గురించి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకో రేవంత్, అబద్ధాలు చెప్తే నష్టపోతావు" అని హెచ్చరించారు.

​పగలు కాంగ్రెస్‌.. రాత్రి బీజేపీ!


​రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే పొద్దున కాంగ్రెస్ వాళ్ళతో ఉంటాడని, రాత్రికి బీజేపీ వాళ్ళతో ఉంటాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. శీల పరీక్ష చేయాలంటే ముందు నాలుగు పార్టీలు మారిన రేవంత్ రెడ్డికి చేయాలన్నారు. "రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ లాంటి పవర్ ఫుల్ పార్టీ ఒక్క ఎన్నికలో మీ దొంగ ఓట్లతో ఓడిపోతే బీఆర్ఎస్ పని అయిపోయినట్లా? రాహుల్ గాంధీ 2014 నుండి 3 సార్లు ఓడిపోయాడు, అంతమాత్రాన దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందా? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 117 కాదు కదా.. కనీసం 7 అసెంబ్లీ స్థానాలు కూడా రావు" అని కేటీఆర్ జోస్యం చెప్పారు.
​హరీష్ రావును కేసీఆర్ తయారు చేసిన అజేయమైన సైనికుడిగా అభివర్ణించిన కేటీఆర్.. పార్టీ ఆవిర్భావం కంటే ముందు నుండి ఆయన కేసీఆర్‌కు రక్షణ కవచంగా నిలిచారని, ఆయన క్యారెక్టర్‌ను శంకించే స్థాయి రేవంత్ రెడ్డికి లేదన్నారు.