"​మా మీద కక్షతో రైతుల నోట్లో మట్టి కొట్టకు!"

మేడిగడ్డను ముట్టకుండానే కన్నెపల్లి నుంచి 200 టీఎంసీలు ఎత్తేయొచ్చు ​రిటైర్డ్ ఇంజనీర్ల నివేదిక చూసైనా ‘సోయి’ తెచ్చుకో రేవంత్ రెడ్డి: కేటీఆర్ ధ్వజం ​ "రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచితంగా తెచ్చిన కరువు" అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయాలనే రాజకీయ కుట్రతో, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్లముందే గోదావరి నీళ్లు సముద్రం పాలువుతున్నా రైతులకు ఇవ్వకుండా ఆగం చేస్తోందని ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై నిప్పులు చెరిగారు. ​94 మీటర్లకే...