Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

"దమ్ముంటే రాజీనామా చెయ్.. లేదా ఇంట్లో పడుకో!" : కడియంపై మంత్రి కొండా సురేఖ ‘ఫైర్’

Author MANA VISHWAM | 10 Jul 2026, 11:48 AM | Politics
"దమ్ముంటే రాజీనామా చెయ్.. లేదా ఇంట్లో పడుకో!" : కడియంపై మంత్రి కొండా సురేఖ ‘ఫైర్’

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వేదికగా ‘సురేఖ వర్సెస్ కడియం’ వివాదం పీక్స్‌కు చేరింది. దేవాదాయ శాఖ సమీక్షా సమావేశం వివాదంపై స్పందించిన మంత్రి కొండా సురేఖ.. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "కడియం శ్రీహరికి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ తరపున గెలిచి చూపించాలి.. లేదంటే ఇంట్లో పడుకోవాలి" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
​ఈ వ్యవహారంపై ఆమె ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి ఫిర్యాదు చేయగా, ఈ నెల 14న ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌లో అంతర్గత పోరు ఒక్కసారిగా వేడెక్కింది.


​'మంత్రి'గా ఇమడలేకనే ఈ డ్రామాలు!

​40 ఏళ్ల రాజకీయ అనుభవం, 15 ఏళ్లపాటు మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరి.. ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే పదవిలో ఇమడలేకపోతున్నారని కొండా సురేఖ ఎద్దేవా చేశారు.
​"మొదటి నుంచి కడియం శ్రీహరి బుద్ధి ఇంతే. ఆయనొచ్చాకే కాంగ్రెస్ పార్టీలో వివాదాలు మొదలయ్యాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసిన ఆయన తప్పు ఒప్పుకోవాల్సింది పోయి నాపైనే ఎదురుదాడికి దిగడం ఏంటి? జిల్లాను డిస్టర్బ్ చేయాలనుకుంటే ఊరుకునేది లేదు. కడియంతో తాడోపేడో తేల్చుకుంటా!"
– మంత్రి కొండా సురేఖ

ఇవి కూడా చదవండి


​బిడ్డకు కాంగ్రెస్ ఎంపీ పదవి.. ఆయన మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా?


​కడియం శ్రీహరి ద్వంద్వ నీతిని అవలంబిస్తున్నారని సురేఖ తీవ్రంగా ఆరోపించారు. తాను మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ, తన బిడ్డను కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిపించుకున్నారని విమర్శించారు. "నిజంగా ఆయనకు రాజకీయ విలువలు ఉంటే తక్షణమే రాజీనామా చేయాలి. గతంలో నేను పార్టీ మారినప్పుడు నా భర్త కొండా మురళి తన ఎమ్మెల్యే పదవికి త్యాగం చేశారు. కడియంకు అంత నిజాయితీ ఉందా?" అని సవాల్ విసిరారు.


​మినిట్స్ బుక్కే సాక్ష్యం.. ఆ సీట్లో కూర్చోవడానికి ఆయనెవరు?


​దేవాదాయ శాఖ అధికారులతో కడియం శ్రీహరి ఏకపక్షంగా సమీక్ష నిర్వహించారనడానికి ఆయన పీఆర్వో ప్రెస్ నోటే సాక్ష్యమని సురేఖ స్పష్టం చేశారు. కమిషనర్ చాంబర్‌కు వెళ్తే తనకేం అభ్యంతరం లేదన్న మంత్రి.. మీటింగ్ హాల్‌లో మంత్రి, కమిషనర్ కూర్చునే ప్రధాన కుర్చీలో కడియం కూర్చుని అధికారులకు ఆదేశాలు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
​ఆలయ భూముల రక్షణపై తానే ఆదేశాలు ఇచ్చినట్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారని,
​మినిస్టర్ స్థాయిలో రివ్యూ నిర్వహించి, ఇప్పుడు తిరిగి తమపైనే బురదజల్లుతున్నారని మండిపడ్డారు.
​ప్రతిపక్షాల చేతికి ఆయుధం ఇవ్వకూడదనే, పార్టీ ప్రతిష్ట దెబ్బతినకూడదనే తాను ఈ విషయాన్ని ఆదిలోనే అడ్డుకుంటున్నట్లు కొండా సురేఖ స్పష్టం చేశారు. అధిష్టానం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాలని ఆమె కోరారు. ఏదేమైనా.. వరంగల్ రాజకీయాల్లో ఈ ఇద్దరు సీనియర్ల పోరు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.