"దమ్ముంటే రాజీనామా చెయ్.. లేదా ఇంట్లో పడుకో!" : కడియంపై మంత్రి కొండా సురేఖ ‘ఫైర్’

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వేదికగా ‘సురేఖ వర్సెస్ కడియం’ వివాదం పీక్స్‌కు చేరింది. దేవాదాయ శాఖ సమీక్షా సమావేశం వివాదంపై స్పందించిన మంత్రి కొండా సురేఖ.. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "కడియం శ్రీహరికి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ తరపున గెలిచి చూపించాలి.. లేదంటే ఇంట్లో పడుకోవాలి" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ​ఈ వ్యవహారంపై ఆమె ఇప్పటికే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి ఫిర్యాదు చేయగా, ఈ నెల 14న ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌లో అంతర్గత పోరు ఒక్కసారిగా వేడెక్కింది....