Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

‘ఇడుపు కాయితం’ టైటిల్‌పై దుమారం: నెట్టింట భాషా యుద్ధం!

Author MANA VISHWAM | 29 Jun 2026, 06:51 PM | Cinema
‘ఇడుపు కాయితం’ టైటిల్‌పై దుమారం: నెట్టింట భాషా యుద్ధం!

సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు సమర్పణలో తెరకెక్కుతున్న ‘ఇడుపు కాయితం’ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వినూత్న టైటిల్‌పై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు, ప్రతి-విమర్శలు గుప్పించుకుంటున్నారు.

​అసలేం జరుగుతోంది?

​టైటిల్ ప్రకటించిన వెంటనే కొందరు నెటిజన్లు దీనిపై నెగెటివ్ కామెంట్లు, వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.ఈ విమర్శలు కాస్తా.. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతీయ మాండలికాల మధ్య పెద్ద చర్చకు దారితీశాయి.తెలంగాణ భాషాభిమానులు, రచయితలు ఈ టైటిల్‌కు మద్దతుగా నిలిచారు. ఏ ప్రాంతపు మాండలికమైనా తెలుగు భాషకు ఒక అందమైన ఆభరణం లాంటిదేనని వారు స్పష్టం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

​తెరపైకి గరికపాటి పాత వ్యాఖ్యలు

​ఈ వివాదం నేపథ్యంలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గతంలో తెలంగాణ భాషపై చేసిన వ్యాఖ్యల వీడియోలు మళ్లీ నెట్టింట వైరల్‌గా మారాయి.
​"తెలంగాణ మాండలికం గ్రాంథిక తెలుగుకు అత్యంత దగ్గరగా ఉంటుంది. ఎన్నో ప్రాచీన తెలుగు పదాలు ఇప్పటికీ అక్కడ సజీవంగా వాడుకలో ఉన్నాయి."
— గతంలో గరికపాటి వ్యాఖ్యలు

​అసలు ‘ఇడుపు కాయితం’ అంటే ఏంటి?

​భాషా పరిశోధకులు, గ్రామీణ పెద్దల సమాచారం ప్రకారం.. ‘ఇడుపు కాయితం’ అనేది తెలంగాణ గ్రామీణ సంస్కృతిలో భాగం. గతంలో భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో విడిపోవాలని అనుకున్నప్పుడు, గ్రామ పెద్దల సమక్షంలో రాసుకునే ఒక ఒప్పంద పత్రాన్ని (Divorce/Separation Document) ‘ఇడుపు కాయితం’ అని పిలిచేవారు.
​ ఇది కేవలం ఒక పదం మాత్రమే కాదు, తెలంగాణ గ్రామీణ సామాజిక వ్యవస్థకు సంబంధించిన ఒక చారిత్రక సాక్ష్యం.

​భాషా ప్రేమికులు, సినీ విశ్లేషకులు ఈ వివాదంపై స్పందిస్తూ.. తెలుగు భాషలోని ప్రతి మాండలికానికి ఒక ప్రత్యేకత, అందం ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ప్రాంతీయ పదాలను అవహేళన చేయడం కంటే, వాటి వెనుక ఉన్న చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని గౌరవించాలని సూచిస్తున్నారు.