Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

‘ఓజీ 2’ పనులు షురూ.. సుజీత్‌తో పవన్ కళ్యాణ్ వీడియో వైరల్!

Author MANA VISHWAM | 25 Jun 2026, 03:23 PM | Cinema
‘ఓజీ 2’ పనులు షురూ.. సుజీత్‌తో పవన్ కళ్యాణ్ వీడియో వైరల్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’కి సీక్వెల్‌గా రాబోతున్న' ఓజీ 2'పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. గురువారం (జూన్ 25న) చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఒక ప్రత్యేక వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

​“తుపాను రాకముందు నిశ్శబ్దం”
​‘ఓజీ యూనివర్స్ ప్రారంభం’ అనే కాన్సెప్ట్‌తో రిలీజ్ చేసిన ఈ వీడియో అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. “గంభీరమైన కథ సిద్ధమవుతోంది.. తుపాను రాకముందు నిశ్శబ్దం ఉంటుంది” అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో వచ్చిన ఈ అప్‌డేట్‌పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.ఈ వీడియోలో దర్శకుడు సుజీత్‌తో కలిసి పవన్ కళ్యాణ్ కథ, స్క్రిప్ట్‌కు సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తూ కనిపించారు.
​వీడియో చివర్లో పవన్ కళ్యాణ్ “నేను సిద్ధం” అని చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది.
​ ఈ వీడియో ద్వారా ‘ఓజీ 2’ రెగ్యులర్ షూటింగ్ చాలా త్వరలోనే ప్రారంభం కానుందనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
​ మొదటి భాగంలో చూపించిన గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని మించి, ఈ సీక్వెల్‌ను మరింత విస్తృత స్థాయిలో, అంచనాలకు అందని కొత్త మలుపులతో సుజీత్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం.

​క్రేజీ కాంబినేషన్ రిపీట్!

ఇవి కూడా చదవండి

​ డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. మొదటి భాగానికి అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన థమన్, ఈ సీక్వెల్‌కు కూడా సంగీతం అందించనున్నారు.​పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ బాధ్యతలతో తీరిక లేకుండా ఉన్నప్పటికీ, ‘ఓజీ 2’ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించడం విశేషం. మొదటి భాగం సృష్టించిన హైప్‌ను మించేలా, అంతకు మించిన పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సీక్వెల్ ఉండబోతోందని స్పష్టమవుతోంది