Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

ధనుష్ - మృణాల్ ఠాకూర్: ఆ ‘ప్రేమాయణం’ ముగిసినట్లేనా? సోషల్ మీడియాలో కొత్త టాక్!

Author MANA VISHWAM | 21 Jun 2026, 09:48 PM | Cinema
ధనుష్ - మృణాల్ ఠాకూర్: ఆ ‘ప్రేమాయణం’ ముగిసినట్లేనా? సోషల్ మీడియాలో కొత్త టాక్!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ మధ్య గత కొంతకాలంగా ఏదో నడుస్తోందంటూ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై సరికొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ధనుష్, మృణాల్ ఒకరికొకరు దూరమయ్యారని, వీరి బంధానికి బ్రేక్ పడిందని నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది.

​అసలు పుకార్లు ఎలా మొదలయ్యాయంటే..?

​గతంలో వీరిద్దరూ పలు సందర్భాల్లో కలిసి కనిపించడంతో ఈ ప్రేమ ఊహాగానాలు మొదలయ్యాయి. గత ఏడాది ఆగస్టులో మృణాల్ నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ప్రీమియర్ షోలో ధనుష్ సందడి చేశారు. ఆ తర్వాత ధనుష్ ‘తేరే ఇష్క్ మే’ వేడుకలో మృణాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో ధనుష్ సోదరీమణులు కార్తీక, విమలా గీతలను ఫాలో అవుతుండటం కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది.ఇద్దరి ఆలోచనలు, విలువలు కలవడంతో వీరు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే రేంజ్‌లో కథనాలు వచ్చాయి. ఈ ప్రచారాలపై ధనుష్ ఎప్పుడూ నోరు విప్పలేదు. కానీ, మృణాల్ మాత్రం గతంలో స్పందిస్తూ.. "ధనుష్ నాకు కేవలం ఒక మంచి స్నేహితుడు మాత్రమే" అని క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ ఈ పుకార్లకు బ్రేక్ పడలేదు.

ఇవి కూడా చదవండి

​ఎందుకీ దూరం? సస్పెన్స్! ​

తాజా టాక్ ప్రకారం.. ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు దూరం పెరిగిందని, ఇద్దరూ విడిపోయారని సినీ వర్గాలు అంటున్నాయి. అయితే, వీరి మధ్య విభేదాలు రావడానికి గల అసలు కారణాలు ఏంటనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు. అటు ధనుష్ గానీ, ఇటు మృణాల్ గానీ ఈ తాజా రూమర్లపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించకపోవడంతో ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది సస్పెన్స్‌గా మారింది. ​

ధనుష్ ఫ్లాష్ బ్యాక్.. ​

ధనుష్ గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 18 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత, వీరిద్దరూ 2022లో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు. వీరికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ విడాకుల తర్వాత ధనుష్ పేరు ఇలా మృణాల్‌తో వినపడటం, ఇప్పుడు మళ్లీ బ్రేకప్ టాక్ రావడం హాట్ టాపిక్‌గా మారింది.