Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

Author MANA VISHWAM | 24 Nov 2026, 07:07 PM | తాజా వార్తలు
సీఎం సహాయనిధి చెక్కు అందజేత

పెంచికలపేట మండలం బొంబాయిగూడ గ్రామానికి చెందిన ఆలం చిన్నన్నకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.20,500 చెక్కును మంగళవారం బీజేపీ మండల అధ్యక్షుడు కుకుడే రాజేష్ ఆధ్వర్యంలో నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ అనారోగ్యంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందిన వారికి సీఎం సహాయనిధి ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు ఆదేశాల మేరకు దళారుల ప్రమేయం లేకుండా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి చెక్కులను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పాగిడే రఘునాథ్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు పాగిడే కాంతారావు, యువ బీసీ మోర్చా మండల అధ్యక్షుడు మీసారి కమలాకర్, పోర్తెట్టి బుచ్చన్న, గ్రామస్తులు, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.