Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

కార్మికులను నేలపై కూర్చోబెడతారా?

Author MANA VISHWAM | 06 Nov 2026, 09:29 PM | తాజా వార్తలు
కార్మికులను నేలపై కూర్చోబెడతారా?

ఆర్టీసీ కార్మికులు నేలపై కూర్చోవడం.. డిపో మేనేజర్ మాత్రం కుర్చీలో కూర్చొని మాట్లాడటం వివాదానికి దారితీసింది. సిద్దిపేట ఆర్టీసీ డిపోలో చోటుచేసుకున్నట్లుగా ప్రచారంలోకి వచ్చిన ఈ వ్యవహారంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా అధికారులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఘటనపై ఆర్టీసీ ఎండీతో మాట్లాడిన మంత్రి సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని ఆదేశించారు. డిపో మేనేజర్ వ్యవహారశైలితో పాటు ఘటనకు దారితీసిన పరిస్థితులను పరిశీలించాలని సూచించారు.
ఆర్టీసీ సంస్థను ముందుకు నడిపించేది కార్మికుల శ్రమేనని, వారిని గౌరవంగా చూడటం ప్రతి అధికారి బాధ్యతని మంత్రి స్పష్టం చేశారు. పదవులు, హోదాలను అడ్డుపెట్టుకొని ఉద్యోగులను చిన్నచూపు చూడటం సరికాదన్నారు. ప్రజాపాలనలో కార్మికుల సంక్షేమంతో పాటు వారి ఆత్మగౌరవానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అధికారులు తమ సిబ్బందితో మర్యాదపూర్వకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. విచారణలో ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కార్మికుల గౌరవానికి భంగం కలిగించే ఘటనలను ఉపేక్షించే ప్రసక్తే లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.