Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

గోల్డ్‌ స్మగ్లింగ్‌.. రూ.475 కోట్ల దందా!

Author MANA VISHWAM | 29 Sep 2026, 12:07 AM | తాజా వార్తలు
గోల్డ్‌ స్మగ్లింగ్‌.. రూ.475 కోట్ల దందా!

దేశవ్యాప్తంగా గుట్టుగా సాగుతున్న భారీ బంగారం అక్రమ రవాణా ముఠా గుట్టును రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్‌ అధికారులు రట్టు చేశారు. సుమారు రూ.10 కోట్ల విలువైన 6.6 కిలోల విదేశీ మూలాల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ముఠా సూత్రధారితో సహా 11 మందిని అరెస్టు చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో చేపట్టిన చర్యలతో ఈ భారీ నెట్‌వర్క్‌ వెలుగులోకి వచ్చింది.
ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే లెక్కలు బయటపడ్డాయి. ఈ ముఠా గత తొమ్మిది నెలల్లోనే సుమారు 318 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించినట్లు అధికారులు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.475 కోట్లుగా అంచనా వేశారు. విదేశాల నుంచి వచ్చిన బంగారాన్ని కొరియర్‌ మార్గాల ద్వారా తరలించి, దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరవేసేందుకు ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.
బంగారం ఎక్కడి నుంచి వస్తోంది? దేశంలో ఎవరెవరికి చేరుతోంది? ఈ దందా వెనుక ఇంకా ఎవరున్నారు? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తును విస్తరించారు. అరెస్టయిన వారి నుంచి లభించిన సమాచారం ఆధారంగా ముఠాతో సంబంధమున్న ఇతర వ్యక్తులు, నెట్‌వర్క్‌లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని అరెస్టులు, స్వాధీనాలు జరిగే అవకాశం ఉంది.