Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

సుఖాన్ని మరిచిన నా తల్లీ!

Author MANA VISHWAM | 26 Sep 2026, 06:30 PM | తాజా వార్తలు
సుఖాన్ని మరిచిన నా తల్లీ!

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కనకాపూర్ గ్రామం మాది...

ఎన్ని కథలు రాసినా పూర్తి కాని కథ ఒకటుంది, అదే... మా అమ్మ కథ!

ఇంటి ముంగిటి పొయ్యిలా అటు మండక, ఇటు ఆరిపోక,మధ్యలో పొగలో బంధీ అయినట్టు, కష్టాల సుడిగుండంలోనే బతుకుతుంది.ఒక కష్టం నుండి తప్పించుకుంటే, మరో కష్టం మెడకు చుట్టుకుంటుంది.ఇంటికి దూలం లాగా కుటుంబ భారాన్నంతా తన భుజాలపైనే మోస్తుంది.

ఇవి కూడా చదవండి

ఊరందరికీ కూలీ అయినా,మా ఇంటికి మాత్రం ఆమే యజమాని

నాన్న తెచ్చే గొడవల మధ్యలో, అమ్మను లాగి తిడుతుంటే, ఆ నోళ్లను నులిమి న్యాయం చేయాలని రక్తం మరుగుతుంది.అన్నెం పున్నెం ఎరుగని నా తల్లి, పొలం గట్ల మీద తన ఆత్మగౌరవాన్ని సైతం మా కోసం చంపుకుంటుంది.
చాలీ చాలని తిండితో, తెల్లారకముందే సద్దిమూట కట్టుకొని, గొడ్డుకారం మడిచి, వాగులు వంకలు దాటుకుంటూ పరిగెడుతుంది. సూర్యుడే ఆమె గడియారం, పొద్దు వాలే వరకు పొలంలోనే చెమట చుక్క అవుతుంది. యాభై రూపాయల కోసం రాత్రయినా గడ్డ దిగదు. ఇంటికి వచ్చాక, పగిలిన తన కాళ్లను చూసి “అయ్యో కాళ్లు" అంటుంది కానీ, "అయ్యో నేను" అని ఒక్కనాడూ అనుకోదు.
నిజానికి మా అమ్మ అలసటకే దూరమైంది. ఆమె కష్టం అలుపెరగనిది, మాటల్లో చెప్పలేనిది. సుఖం అనే మాటను చిన్నప్పుడే మర్చిపోయింది.సుఖపడని నా తల్లిని చూస్తే, నా గుండె బరువెక్కుతుంది.ఒక్కటే నా ఆశ... ఏనాటికైనా మా అమ్మను ఈ కష్టాల సంకెళ్ల నుండి విముక్తి చేయాలి!

సీనియర్ పాత్రికేయులు.. ఈర్ల గణేష్.. 9553994656