Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

దానంపై అనర్హత వేటు!

Author MANA VISHWAM | 18 Sep 2026, 04:19 PM | TELANGANA
దానంపై అనర్హత వేటు!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 (మన విశ్వం): ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హత వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తూ అసెంబ్లీ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు పక్కనపెట్టింది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దానం నాగేందర్‌ విజయం సాధించారు. అనంతరం ఆయన కాంగ్రెస్‌ వైపు వెళ్లారంటూ రాజకీయ వివాదం మొదలైంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేయడంతో అనర్హత అంశం మరింత కీలకంగా మారింది.

దానంపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. అయితే వాటిని స్పీకర్‌ తిరస్కరించడంతో ఆ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.

ఇవి కూడా చదవండి

ఈ వ్యవహారంపై వాదనలు పూర్తి చేసిన హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. సెప్టెంబర్‌ 18న మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రత్యేక ధర్మాసనం సమావేశమయ్యేలా హైకోర్టు కాజ్‌లిస్ట్‌లోనూ షెడ్యూల్‌ నమోదైంది.

తాజా తీర్పుతో దానం నాగేందర్‌ ఎమ్మెల్యే పదవికి సంబంధించిన వ్యవహారం కీలక మలుపు తిరిగింది.