Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

బీఎస్పీకి గుడ్‌బై.. కాంగ్రెస్‌లోకి దుర్గం ప్రవీణ్‌

Author MANA VISHWAM | 18 Sep 2026, 02:38 PM | తాజా వార్తలు
బీఎస్పీకి గుడ్‌బై.. కాంగ్రెస్‌లోకి దుర్గం ప్రవీణ్‌

కాగజ్‌నగర్‌, సెప్టెంబర్‌ 18 (మన విశ్వం): కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలో బీఎస్పీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బీఎస్పీ జిల్లా ఇన్‌ఛార్జి దుర్గం ప్రవీణ్‌తో పాటు 40 మంది కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్‌ సమక్షంలో ఈ చేరికలు జరిగాయి.
డక్కలి సంఘం జిల్లా అధ్యక్షుడు జడల శంకర్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి ఆహ్వానించారు. పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమంతో పాటు సామాజిక న్యాయానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని భావించే తాము పార్టీలో చేరినట్లు దుర్గం ప్రవీణ్‌, ఇతర నాయకులు తెలిపారు.
గత బీఆర్‌ఎస్‌ పాలనలో దళితులకు ఇచ్చిన పలు హామీలు అమలు కాలేదని వారు విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరామని పేర్కొన్నారు.