Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

హమారా ప్రసాద్‌ దిష్టిబొమ్మ దహనం

Author MANA VISHWAM | 18 Sep 2026, 12:56 PM | తాజా వార్తలు
హమారా ప్రసాద్‌ దిష్టిబొమ్మ దహనం

కొమురం భీం/బెజ్జూర్‌, సెప్టెంబర్‌ 18 (మన విశ్వం): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌పై వివాదాస్పదంగా రచనలు చేశారంటూ రచయిత హమారా ప్రసాద్‌పై కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూరులో అంబేడ్కర్‌ యువజన సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.
అంబేడ్కర్‌ చరిత్రను వక్రీకరించేలా పుస్తకంలో అంశాలు ఉన్నాయని సంఘం నాయకులు ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను కించపరిచే ప్రయత్నాలను సహించేది లేదన్నారు. సామాజిక భావోద్వేగాలను దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
హమారా ప్రసాద్‌పై వెంటనే క్రిమినల్‌ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. నిరసన కార్యక్రమంలో స్థానిక దళిత సంఘాల నాయకులు, అంబేడ్కర్‌ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.