Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

గణేష్ ఉత్సవాల వేళ సోషల్ మీడియాపై పోలీసుల డేగకన్ను

Author MANA VISHWAM | 15 Sep 2026, 05:19 PM | తాజా వార్తలు
గణేష్ ఉత్సవాల వేళ సోషల్ మీడియాపై పోలీసుల డేగకన్ను

ముధోల్ (నిర్మల్ రూరల్), సెప్టెంబర్ 15 (మన విశ్వం):
గణేష్ ఉత్సవాల వేళ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, వదంతులతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ హెచ్చరించారు. వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్ సహా ప్రధాన సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా బృందాలతో నిరంతర పర్యవేక్షణ చేపట్టినట్లు వెల్లడించారు.
మత విద్వేషాలను రెచ్చగొట్టేలా, ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా పోస్టులు పెట్టినా.. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినా.. పుకార్లు వ్యాప్తి చేసినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వివాదాస్పద పోస్టులు, సందేశాల విషయంలో వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో, పరస్పర స్నేహపూర్వక వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోందన్నారు. ఉత్సవ కమిటీలు, యువత, ప్రజలు పోలీసులకు సహకరించాలని డీఎస్పీ శ్రీనివాస్ కోరారు.