Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

బడి ఆవరణలో మందుబాబుల హల్చల్..!

Author MANA VISHWAM | 15 Sep 2026, 04:49 PM | తాజా వార్తలు
బడి ఆవరణలో మందుబాబుల హల్చల్..!

ముధోల్(కుంటాల),సెప్టెంబరు15(మన విశ్వం): విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన సరస్వతీ నిలయం కాస్తా, మందుబాబులకు అడ్డాగా మారింది.నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూర్ గ్రామ ప్రాథమిక పాఠశాల (MPPS) ఆవరణలో ప్రతిరోజు సాయంత్రం అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పాఠశాల సమయం ముగిసిన తర్వాత కొంతమంది ఆకతాయిలు,మందుబాబులు యథేచ్ఛగా లోపలికి ప్రవేశించి మద్యంసేవిస్తున్నారు.తాగిన అనంతరం ఖాళీ బీర్ బాటిళ్లను,గ్లాసులను అక్కడే విసిరేసి వెళ్తున్నారు. దీంతో ఉదయం బడికి వచ్చే చిన్నారి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆవరణ మొత్తం అపరిశుభ్రంగా మారి దుర్వాసన వస్తోందని,గాజు పెంకులు గుచ్చుకుంటాయేమోనని తల్లిదండ్రులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.పవిత్రమైన పాఠశాల ప్రాంగణాన్ని ఇలా ఆపరిశుభ్రతం చేస్తుంటే అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా పై అధికారులు వెంటనే స్పందించి,ఇక్కడ నిఘా పెంచాలని మరియు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు