Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

పెద్దమ్మ తల్లి ఆలయానికి బోరు

Author MANA VISHWAM | 14 Sep 2026, 08:36 PM | తాజా వార్తలు
పెద్దమ్మ తల్లి ఆలయానికి బోరు

ములుగు, సెప్టెంబర్ 14 (మన విశ్వం): ములుగు జిల్లా బండారుపల్లి గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద మంత్రి ధనసరి అనసూయ సీతక్క సహకారంతో ఆదివారం బోరు వేయించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆదేశాల మేరకు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, ములుగు మున్సిపల్ చైర్మన్ చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి సూచనలతో బోరు పనులు చేపట్టారు.
ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ నాయకులు, స్థానికులు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి ఇచ్చిన హామీలను మంత్రి ఒక్కొక్కటిగా అమలు చేస్తూ బండారుపల్లిని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని కాంగ్రెస్ ములుగు పట్టణ ఉపాధ్యక్షుడు కక్కెర్ల అశోక్‌గౌడ్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ కేశెట్టి నవీన్, కో-ఆప్షన్ సభ్యుడు కుక్కల నాగరాజు, కాంగ్రెస్ నాయకులు నెల్లుట్ల రాజన్న, పౌడాల కిషోర్, బాబురావు తదితరులు పాల్గొన్నారు.