Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

మల్హర్ మండలంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

Author MANA VISHWAM | 14 Sep 2026, 05:33 PM | తాజా వార్తలు
మల్హర్ మండలంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

మల్హర్, (మన విశ్వం):భూపాలపల్లి జిల్లా మల్హర్ మండల వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో వీధివీధినా గణనాథుల విగ్రహాలను ప్రతిష్టించి, ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు చేపట్టారు.​తాడిచర్ల గ్రామంలోని ‘ఫ్రెండ్స్ గణపతి’ మండపం వద్ద నిర్వాహకులు తిర్రి అశోక్, పైడాకుల సమ్మయ్య, గుంటూకు తిరుపతి తదితరుల ఆధ్వర్యంలో వినాయక విగ్రహాన్ని వైభవంగా ప్రతిష్టించారు. స్వామివారికి పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంల కుశన రాజేంద్రప్రసాద్, పైడాకుల రాంప్రసాద్ ,కుశన శ్రీకాంత్, పంతంగి శ్రవణ్, బైరోజు సురేష్,కోట సతీష్, ఉట్నూరీ శ్రవణ్, మెడగని సుదర్శన్, రాచర్ల చెందు ఒజెల నాగరాజు,సిద్ధుల సపంత్ , ఉట్నూరీ సాయి,సుంకరి సాయి , కుంట నరేష్, కుశన గణేష్,నడిగోట చింటూ,స్థానిక యువకులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణపతిని దర్శించుకున్నారు.
​