Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

వినాయక ఉత్సవాల్లో నిబంధనలు తప్పనిసరి

Author MANA VISHWAM | 13 Sep 2026, 02:17 PM | తాజా వార్తలు
వినాయక ఉత్సవాల్లో నిబంధనలు తప్పనిసరి

నల్లబెల్లి, సెప్టెంబర్ 13 (మన విశ్వం): వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రభుత్వం, పోలీసు శాఖ నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సీఐ శంకర్‌రావు సూచించారు. ఎస్సై సాయి ప్రసన్నకుమార్ సమక్షంలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులతో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు.
గ్రామ ప్రథమ పౌరులుగా సర్పంచులు ప్రత్యేక బాధ్యత తీసుకుని మండపాల ఏర్పాటు, విద్యుత్ భద్రత, ఊరేగింపులు, నిమజ్జనం తదితర అంశాలను పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలకు, రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టడంతో పాటు వివాదాలు, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పోలీసుల సూచనలను పాటిస్తూ పరస్పర సహకారంతో ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని సీఐ శంకర్‌రావు, ఎస్సై సాయి ప్రసన్నకుమార్ కోరారు.