Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

కార్మికుల హక్కుల పరిరక్షణే NMU లక్ష్యం

Author MANA VISHWAM | 13 Sep 2026, 01:42 PM | హన్మకొండ
కార్మికుల హక్కుల పరిరక్షణే NMU లక్ష్యం

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడటమే నేషనల్ మజ్దూర్ యూనియన్ (NMU) లక్ష్యమని వరంగల్ రీజినల్ కార్యదర్శి యాకస్వామి అన్నారు. శనివారం పరకాల ఆర్టీసీ డిపో డీఎంను NMU డిపో కమిటీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా యాకస్వామి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, హక్కుల సాధన కోసం NMU ఎన్నో ఏళ్లుగా కార్మికుల పక్షాన నిలుస్తోందన్నారు. కార్మికుల ఐక్యతే సంఘానికి బలమని, సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాటమే మార్గమని పేర్కొన్నారు. ప్రతి కార్మికుడు NMUను బలోపేతం చేస్తూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ‘‘ఐక్యతే మన బలం.. పోరాటమే మన లక్ష్యం’’ అని అన్నారు.
కార్యక్రమంలో NMU నాయకులు ప్రసాద్, జోతన్‌రెడ్డి, నరేష్, రవీందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల హక్కుల పరిరక్షణే NMU లక్ష్యం - Additional Image