Advertisement Space Frame Slot Holder (728x90 Billboard Banner Standard)
EPAPER తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ ట్రేండింగ్ స్పెషల్ స్టోరీస్

‘బ్లాక్‌మెయిలర్ల సంఘం ఉంటే.. అధ్యక్షుడు రేవంతే!’

Author MANA VISHWAM | 12 Sep 2026, 01:51 PM | తాజా వార్తలు
‘బ్లాక్‌మెయిలర్ల సంఘం ఉంటే.. అధ్యక్షుడు రేవంతే!’

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్‌రెడ్డి పేరు చెబితేనే బ్లాక్‌మెయిలింగ్‌, దందాలు, కబ్జాలు, బెదిరింపులే గుర్తుకొస్తాయని ఆమె ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు నిండు అసెంబ్లీలో తనకు తానే ‘సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌’ ఇచ్చుకుంటూ సభను సొంత ప్రచార వేదికగా ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు.
సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని గతంలో పలువురిని బెదిరించడం, బ్లాక్‌మెయిల్‌ చేయడం ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టారంటూ రేవంత్‌పై కవిత ఆరోపణలు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాల్సింది పోయి అసెంబ్లీ వేదికగా తనను తాను ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో ‘బ్లాక్‌మెయిలర్ల సంఘం’ అంటూ ఏదైనా ఉంటే దానికి అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డే ఉండాల్సి వస్తుందని కవిత వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి తనపై వస్తున్న ఆరోపణలకు వాస్తవాలతో సమాధానం చెప్పాలని, అసెంబ్లీని వ్యక్తిగత ఇమేజ్‌ బిల్డింగ్‌కు వాడుకోవడం సరికాదని ఆమె పేర్కొన్నారు.
అయితే కవిత చేసిన ఈ ఆరోపణలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లేదా ప్రభుత్వ వర్గాలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే.